Monday, May 6, 2024

Breaking: ఉస్మానియాలో న‌కిలీ స‌ర్టిఫికెట్ల దందా.. 12 మంది అరెస్ట్‌

ఉస్మానియా యూనివ‌ర్సిటీ ప‌రిధిలో న‌కిలీ స‌ర్టిఫికెట్ల దందా క‌ల‌క‌లం రేపుతోంది. ఈ కేసును ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించిన హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్, సీసీఎస్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్య‌క ద‌ర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. క‌మిష‌న‌ర్ ఆదేశాల‌తో రంగంలోకి దిగిన సిట్.. ఇప్ప‌టికే 12 మంది నిందితుల‌ను అరెస్ట్ చేసింది.

ప్ర‌త్యేకించి ఈ న‌కిలీ స‌ర్టిఫికెట్ల దందాకు ఎస్ఆర్కే యూనివ‌ర్సిటీ సిబ్బందే కార‌ణ‌మ‌ని సిట్ గుర్తించిన‌ట్లు స‌మాచారం. దీనికి సంబంధించిన ప్రాథ‌మిక స‌మాచారాన్ని అందుకున్న సిట్.. త‌దుప‌రి ద‌ర్య‌ప్తును ఎస్ఆర్కే యూనివ‌ర్సిటీకి చెందిన సిబ్బంది కేంద్రంగా సాగించ‌నున్న‌ట్లుగా స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement