Sunday, October 6, 2024

ఏపీజీబీ బ్యాంకులో 1.3 కిలోల బంగారం గల్లంతు

కర్నూలు జిల్లా ఉయ్యాలవాడలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో 1.3 కిలోల బంగారం గల్లంతైన విషయం స్థానికంగా కలకలం సృష్టించింది. శుక్రవారం ఒక రైతు తన బంగారు లోన్ రెన్యూవల్ చేసేందుకు రావటంతో ఆ రైతు బంగారం కనిపించలేదు. దీంతో స్థానిక బ్యాంక్ మేనేజర్ మధుసూదన్ నంద్యాల ఆర్ఎంకు సమాచారం అందించారు. ఆర్ఎం జేఎల్ఎన్ ప్రసాద్ ఉయ్యాలవాడ బ్యాంకుకు చేరుకుని విచారణ చేయగా 1.3 కిలోల బంగారం గల్లంతు అయినట్లు గుర్తించారు. కాగా ఈ విషయంపై ఆర్ఎం, మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement