Friday, May 3, 2024

రైల్వే ప్రయాణికులపై బాదుడు.. ప్లాట్‌ఫారం టిక్కెట్ పెంపు

ఇండియేన్ రైల్వేస్ ప్రయాణికులపై మరోసారి భారం మోపింది. ఇప్పటివరకు రూ.10గా ఉన్న ప్లాట్‌ఫారం టిక్కెట్ ధరను రూ.30కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ టిక్కెట్ కొన్నవారు 2 గంటల పాటు ప్లాట్‌ఫారంపై ఉండొచ్చని సూచించింది. అటు లోకల్ రైళ్లలో కనీస ఛార్జీని రూ.30కి పెంచింది. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనవసర ప్రయాణాలను అదుపు చేసేందుకు మాత్రమే ఈ ఛార్జీలను పెంచినట్లు భారతీయ రైల్వే అధికారులు వెల్లడించారు. ప్లాట్‌ఫారంపై ఎక్కువమంది గూమికూడకుండా ఉండేందుకు తాత్కాలికంగా ప్లాట్‌ఫారం టిక్కెట్ ధరలను పెంచామని వివరించింది. కరోనా లాక్‌డౌన్ అనంతరం ఇప్పటివరకు 65 శాతం రైళ్లు మళ్లీ పట్టాలెక్కినట్లు అధికారులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement