Friday, April 26, 2024

ఇదో మిరాకిల్.. కాలి బూడిదైన విమానం.. సుర‌క్షితంగా ఇద్ద‌రు పైలెట్స్

శివుడి ఆజ్ఞ లేనిదే చీమ‌యినా కుట్ట‌ద‌నే విష‌యం ఇక్క‌డ నిరూపిత‌మ‌యింది. ఓ విమానంలో భారీగా మంట‌లు చెల‌రేగి విమానం కాలి బూడిద‌యింది. అయితే ఆశ్చ‌ర్య‌క‌రంగా ఆ విమానంలో ఉన్న ఇద్ద‌రు పైలెట్స్ మాత్రం సురక్షితంగా ప్రాణాలతో బయటపడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు ఆగ్నేయంగా 420 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫిట్జ్‌గెరాల్డ్‌ నేషనల్‌ పార్క్‌లో బోయింగ్‌ 737 వాటర్‌ బాంబింగ్‌ విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో భారీగా మంటలు చెలరేగి.. ఆ ప్రాంతంలో దట్టంగా పొగ ఆవహించింది. ఈ ప్రమాదంలో విమానం మొత్తం కాలి బూడిదైంది. దాని తోక భాగం మాత్రం కనిపిస్తోంది. ఈ ఘోర ప్రమాదం నుంచి ఇద్దరు పైలెట్స్‌ మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా మంత్రి స్టీఫెన్‌ డాసన్‌ తెలిపారు. ఇదో మిరాకిల్‌ అని అన్నారు. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు పైలెట్స్‌ సురక్షితంగా బయటపడటం మిరాకిల్ అని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement