Saturday, May 4, 2024

Delhi Capitals : అదే మా కొంప ముంచింది…

డ్యూ ప్రభావం ఉంటుందని భావించి ముందుగా బౌలింగ్ ఎంచుకోవడం తమ కొంపముంచిందని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తెలిపాడు. పిచ్ కండిషన్స్‌ను అంచనా వేయడంలో తాము విఫలమయ్యామని ఒప్పుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన హైస్కోరింగ్ గేమ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 67 పరుగుల భారీ తేడాతో చిత్తయ్యింది.

- Advertisement -

ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన రిషభ్ పంత్.. టాస్ గెలిచి ఛేజింగ్ తీసుకోవడం విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు.’డ్యూ వస్తుందనే ఆలోచనతోనే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నా. కానీ డ్యూ ఏ మాత్రం రాలేదు. అయినా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 220-230 పరుగులకు కట్టడి చేసే అవకాశం ఉండే. కానీ పవర్ ప్లేలో సన్‌రైజర్స్ బ్యాటర్లు విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు.

ఈ పవర్ ప్లేనే మా ఓటమిని శాసించింది. వారు ఏకంగా 125 పరుగులు చేశారు. ఆ తర్వాత కొన్ని కీలకమైన క్యాచ్‌లతో కట్టడి చేశాం. సెకండ్ ఇన్నింగ్స్‌లో బంతి ఆగుతూ వచ్చింది. మేం ఊహించినదాని కంటే ఎక్కువగా పిచ్ స్లో అయ్యింది. 260, 270 పరుగుల లక్ష్యాన్ని ఛేధించాలంటే ధాటిగా ఆడాలి. ముందు ముందు టోర్నీలో మేం మరింత క్లారిటీతో స్పష్టమైన ప్రణాళికలతో బరిలోకి దిగుతాం. ఫెజర్ మెక్‌గుర్క్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. ఓ జట్టుగా మేం ఏం కోరుకున్నామో అతను అలాంటి ప్రదర్శనే ఇచ్చాడు. మా తప్పిదాలను సరిచేసుకొని తదుపరి మ్యాచ్‌కు సిద్దమవుతాం అన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement