Thursday, May 2, 2024

Sunrisers Hyderabad : స‌న్ బ్యాటింగ్ తో బౌల‌ర్ల‌కు న‌ర‌కమే…

ఐపీఎల్ 2024లో శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో భాగ్యనగర్ బ్యాట్స్‌మెన్ విధ్వంసమే సృష్టించారు. దీంతో శనివారం జరిగిన మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి.. కొన్ని రికార్డులు గంట వ్యవధిలోనే తుడుచుపెట్టుకుపోయాయి. మొత్తానికి స్టేడియంకు వచ్చిన ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ వడ్డించారు ఇరు జట్లలోని బ్యాట్స్‌మెన్. ఇదంతా ఇలా ఉంటే సన్‌రైజర్స్ బౌలర్ భువనేశ్వర్ మాత్రం మ్యాచ్ అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ భారీ స్కోరు సాధించడం ద్వారా అదే జట్టుకు చెందిన బౌలర్ల మనసును గాయపరుస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు స్పీడ్‌స్టర్ భువనేశ్వర్ కుమార్. బ్యాట్స్‌మెన్ భారీ స్థాయిలో పరుగులు చేయడం, భారీ స్కోరు సాధించడం వల్ల..ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ సన్‌రైజర్స్ బౌలర్లకు నరకం చూపిస్తున్నారని చెప్పుకొచ్చాడు .భారీ స్కోరు చేయకుండా కట్టడి చేసే క్రమంలో బౌలర్లపై ఒత్తిడి పెరుగుతోందని చెప్పుకొచ్చారు. భారీ స్కోరు చేయడం వల్ల ప్రత్యర్థి జట్టు కూడా తొలిబంతి నుంచే విరుచుకుపడుతోందని చెప్పిన భువీ.. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ చేసే గాయం అంతా ఇంతా కాదని వెల్లడించాడు.

- Advertisement -

ప్రస్తుతం సన్‌రైజర్స్ టాప్ ఆర్డర్ అత్యద్భుతమైన ఫామ్‌లో ఉంది. వచ్చిన బ్యాట్స్‌మెన్ వచ్చినట్టుగానే పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు. దీంతో ఐపీఎల్‌ చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా సన్‌రైజర్స్ జట్టు అద్భుత ఆటతీరును ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నో రికార్డులను సృష్టిస్తోంది. 250కి పైచిలుకు పరుగులు ఈ ఒక్క ఐపీఎల్ 2024 సీజన్‌లోనే సన్‌రైజర్స్ చేసింది. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకునే భువనేశ్వర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ వ్యాఖ్యలు చాలా సరదాగా చేసినవి మాత్రమే.

హైదరాబాద్ జట్టు బ్యాట్స్‌మెన్ సరిగ్గా ఆడకపోతే తక్కువ స్కోరును డిఫెండ్ చేసే క్రమంలో బౌలర్లపై తీవ్ర ఒత్తిడి నెలకొని ఉంటుందని చెప్పాడు భువనేశ్వర్.అయితే తొలిసారిగా హైదరాబాద్ చక్కటి ప్రదర్శన కనబర్చుతుండటం చాలా ఆనందాన్నిస్తోందని భువనేశ్వర్ పేర్కొన్నాడు.ఇంతటి భారీ స్కోరు సాధిస్తుండటంతో బౌలర్లు కాస్త రిలాక్స్ అవుతున్నారని అయ్యేందుకు ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చాడు. ఇక తన సహచర బౌలర్ నటరాజన్‌పై పొగడ్తల వర్షం కురిపించాడు భువనేశ్వర్. నటరాజన్ చూసేందుకు సైలెంట్‌గా ఉన్నా.. బంతితో యార్కర్లు వేసి చాలా వైలెంట్‌గా కనిపిస్తాడని భువీ కితాబిచ్చాడు. కొన్నేళ్లుగా సన్‌రైజర్స్‌కు ఆడుతున్న నటరాజన్ కచ్చితంగా ఆ జట్టుకు మ్యాచ్ విన్నర్ అని అభిప్రాయపడ్డాడు.

ఇదిలా ఉంటే శనివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు పలు రికార్డులను సృష్టించింది. టీ20 పవర్ ప్లే చరిత్రలోనే తొలిసారిగా అత్యధికంగా 125 పరుగులు భాగస్వామ్యంతో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు రికార్డు క్రియేట్ చేశారు.మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసి 67 పరుగుల భారీ ఆధిక్యంతో ఢిల్లీపై హైదరాబాద్ విక్టరీ నమోదు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement