Monday, April 29, 2024

Cricket: భారత్​ vs దక్షిణాఫ్రికా సెకండ్​ వన్డే ఇవ్వాలే.. టీమిండియాకు ఇది కీలక మ్యాచ్​!

హలో వ్యూయర్స్​.. ఇవ్వాల వీకెండ్​ మీకు మంచి ఎంజాయ్​మెంట్​ని ఇస్తుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇవ్వాల ఇండియా, సౌతాఫ్రికా వన్డే మ్యాచ్​ ఉంది కాబట్టి. టీ20 వరల్డ్​ కప్​ సన్నాహక గేమ్స్​ కోసం పెర్త్​లో ఇప్పటికే మ్యాచ్​ ప్రాక్టీస్​ మొదలుపెట్టిన రోహిత్​ అండ్​ టీమ్​పై అందరి దృష్టి ఉంది. అయితే..

రాంచీలో ఇవ్వాల దక్షిణాఫ్రికాతో జరిగే రెండో వన్డే సిరీస్​ని కోల్పోకుండా ఉండడానికి కెప్టెన్​ శిఖర్​ ధావన్​ అండ్​ టీమ్​ కూడా కష్టపడాల్సి ఉంటుంది. వారు ఇవ్వాల తప్పకుండా గెలిస్తేనే మరో వన్డేలో పోరాడేందుకు చాన్స్​ ఉంటుంది. భారత్​లో జరిగే వన్డే సిరీస్​లో పాల్గొంటున్న క్రికెటర్లు ఆస్ట్రేలియాకు వెళ్లే విమానాన్ని ఆఖరి నిమిషంలో ఎక్కలేకపోయారు. వారికి ఈ మ్యాచ్​ పెద్ద పరీక్ష అనుకోవాలి.

కానీ, లక్నలో జరిగిన మొదటి వన్డే మ్యాచ్​కి ముందు దీపక్​ చాహర్​కి చీలమండకు గాయం కావడం, అతని బ్యాక్​ పెయిన్​తో ఇబ్బందిపడుతున్నాడు. అయితే.. ఇక బౌలింగ్​లో వీక్​గా ఉన్న టీమిండాయి ఇవ్వాల ఎట్లాంటి వ్యూహం పన్నబోతోంది అన్నది మాత్రం కాసేపట్లో తెలియబోతోంది. మరిన్ని అప్​డేట్స్​ కోసం చూస్తూనే ఉండండి.. మీ ప్రియమైన వెబ్​సైట్​ www.prabhanews.com లో క్రికెట్​ అప్​డేట్స్​ కోసం సెర్చ్​ చేయడం మాత్రం మరిచిపోకండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement