Tuesday, June 18, 2024

‘షోలే కమింగ్‌ సూన్‌’

రాంచీ – టీమిండియా.. శుక్రవారం న్యూజిలాండ్‌తో తొలి టీ20లో అమీతుమీ తేల్చుకోనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి పోరుకు రాంచీ స్టేడియం వేదిక కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరు జట్లు జార్ఖండ్‌ రాజధాని రాంచీకి చేరుకోగా.. పొట్టి ఫార్మాట్‌లో భారత జట్టుకు సారథ్యం వహిస్తున్న స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. జార్ఖండ్‌ డైనమైట్‌, భారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీతో దిగిన ఫొటోలు ట్విట్టర్‌లో పెట్టిన హార్దిక్‌.. ‘షోలే కమింగ్‌ సూన్‌’ అని రాసుకొచ్చాడు

తొలి మ్యాచ్‌ ఆడేందుకు రాంచీ వచ్చిన సందర్భంగా పాండ్యా.. తన ఆదిగురువు మహీభాయ్‌ను కలిశాడు. ఈ సందర్భంగా వీరిద్దరూ బాలీవుడ్‌ ఎవర్‌గ్రీన్‌ చిత్రం.. ‘షోలే’ తరహాలో ఫొటోలకు ఫోజులిచ్చారు. అమితాబ్‌ బచ్చన్‌, ధర్మేంద్రలా మోటర్‌ బైక్‌పై దిగిన ఫొటోలను పాండ్యా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. ఇందులో హార్దిక్‌ పాండ్యా డ్రైవింగ్‌ సీట్‌పై కూర్చొని ఉండగా.. ధోనీ సైడ్‌ కార్‌లో ఠీవీగా ఆసీనుడయ్యాడు. దీనికి పాండ్యా వినూత్న క్యాప్షన్‌ పెట్టడంతో అది కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement