Saturday, April 13, 2024

IPL | గుజరాత్ టైటాన్స్‌కు షాక్.. ఐపీఎల్‌కు స్టార్ పేసర్ దూరం

గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ మహ్మద్ షమి ఐపీఎల్ 17వ సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు. ప్రస్తుతం చీలమండల గాయంతో బాధపడుతున్న షమి లండన్‌లో శస్త్రచికిత్స చేయించుకోనున్నాడని.. సర్జరీ అనంతరం షమి పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఐపీఎల్‌తో పాటు టీ20 ప్రపంచకప్‌తో సహా స్వదేశంలో జరగనున్న న్యూజిలాడ్, బంగ్లాదేశ్ పర్యటనలకు కూడా షమి అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తొంది.

కాగా, ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ షమి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గత రెండు సీజన్లలో గుజరాత్ ఫైనల్‌కు చేర్చడంలో షమి కీలక పాత్ర పోషించాడు. ఇవాళ సాయంత్రం ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో షమి 17వ సీజన్‌కు దూరమైన వార్త.. గుజరాత్ టైటాన్స్ అభిమానులకే షాక్‌గా మిగిలింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement