Sunday, April 14, 2024

National : షమీ… త్వ‌ర‌గా కోలుకుని మ‌ళ్లీ క్రికెట్ ఆడాలి…ప్ర‌ధాని మోడీ

ఇటీవ‌ల గాయం కారణంగా శస్త్రచికిత్స చేయించుకున్న ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ త్వరగా కోలుకోవాలని భారత ప్రధాని ఆకాంక్షించారు. షమీ వీలైనంత త్వరగా గాయం నుంచి కోలుకొని దేశం తరపున ఆడాల‌ని ఆయన ఆకాంక్షించారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్ లో ట్విట్ చేశారు.

- Advertisement -

ఇది ఇలా ఉంటే మహ్మద్ షమి గతేడాది వరల్డ్ కప్ లో 24 వికెట్లు తీసి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత మడమ గాయానికి గురైన షమి సుమారు మూడున్నర నెలలుగా టీమిండియాకు దూరంగా ఉన్నాడు. గాయం ఎంతకీ మానకపోవడంతో సర్జరీ తప్పదన్న నేషనల్ క్రికెట్ అకాడెమీ ఫిజియోల సూచన మేరకు షమి.. తాజాగా మడమకు శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ సర్జరీతో అతడు ఐపీఎల్ 2024 మొత్తానికి దూరమయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement