Friday, May 3, 2024

పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ, ఆసియాకప్‌ టోర్నీకి దూరమైన షాహిన్‌ అఫ్రిది

ఆసియాకప్‌ 2022 ప్రారంభానికి వారం రోజుల ముందు, పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టుకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టుకు స్టార్‌ ఫాస్ట్‌ బౌలర్‌ షాహిన్‌ షా అఫ్రిది గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. ఈ మేరకు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పిసిబి) ఆగస్టు 20 శ నివారం సోషల్‌ మీడియాలో సమాచారమందింది. షాహిన్‌ గాయంపై వివరణ ఇస్తూ ఓ ట్వీట్‌ చేశాడు. మోకాలి గాయం కారణంగా అఫ్రిది నెల రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టరు సూచించినట్టు పాక్‌ బోర్డు తెలిపింది. ఆసియా కప్‌లో పాకిస్తాన్‌ తన తొలి మ్యాచ్‌ లో ఆగస్టు 28న భారత్‌తో తలపడనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement