Friday, March 29, 2024

ఇన్‌స్టాగ్రామ్‌లో రొనాల్డో అరుదైన ఘనత.. అ40కోట్లు ఫాలోవ‌ర్ల‌తో రికార్డ్..

పోర్చుగల్‌కు చెందిన ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో సోషల్‌మీడియాలో అరుదైన ఘనతను అందుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో రొనాల్డో ప్రపంచవ్యాప్తంగా 400మిలియన్లు (40కోట్లు)కు పైగా ఫాలోవర్లు ఉన్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. రొనాల్డోకు ప్రస్తుతం ఇన్‌స్టాలో ఫాలోవర్ల సంఖ్య 40కోట్లు దాటిపోయింది. గతేడాది జనవరికి 20కోట్ల ఫాలోవర్లు ఉన్న రొనాల్డో ఒక్క సంవత్సరం గడిచేసరికి రెట్టింపు సంఖ్యలో ఫాలోవర్లను సంపాదించుకున్నాడు.

37ఏళ్ల రొనాల్డో ఇటీవల తన జీవిత భాగస్వామి జార్జినా రోడ్రిగ్జ్‌తో ఉన్న ఫొటోను షేర్‌ చేయగా వైరల్‌ అయింది. రొనాల్డో తర్వాత మోడల్‌ కైలీ జెన్నెర్‌, ఫుట్‌బాల్‌ స్టార్‌ మెస్సీ ద్వితీయ, తృతియ స్థానాల్లో ఉన్నారు. కాగా భారత్‌లో కోహ్లీ 18.25కోట్ల ఫాలోవర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement