Saturday, May 4, 2024

Rohith:రోహిత్ శర్మకు గాయం… అభిమానుల్లో క‌ల‌వ‌రం

భారత్‌ వేదికగా జరుగుతోన్న వన్డే వరల్డ్‌ కప్‌-2023లో టీమిండియా జోరు మీద ఉంది. వరుస విజయాలతో దూసుకెళ్తోంది. అయితే ఇవాళ‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు షాక్‌ తగిలింది. శనివారం ప్రాక్టీస్‌ సెషన్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రోహిత్ మణికట్టుకు గాయమైనట్లు తెలిసింది.

వేగంగా దూసుకువచ్చిన బంతి రోహిత్ కుడిచేతి మణికట్టును బలంగా తాకినట్లు సమాచారం. అయితే.. వెంటనే స్పందించిన ఫిజియోథెరపీ రోహిత్‌కు ట్రీట్‌మెంట్ చేశారట. లక్నో వేదికగా జరిగే మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మను అనేక రికార్డులు ఊరిస్తున్నాయి . ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా గేల్ రికార్డును అధిగమించేందుకు రోహిత్ మరో పది సిక్సర్ల దూరంలో ఉన్నాడు. ఇదే సమయంలో ఆదివారం నాటి మ్యాచ్‌.. కెప్టెన్‌గా రోహిత్‌కు వందో మ్యాచ్ కానుంది. అలాగే అంతర్జాతీయ క్రికెట్లో 18 వేల పరుగుల మైలురాయిని చేరుకునేందుకు రోహిత్ 47 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇంగ్లండ్ మ్యాచ్‌లో హిట్ మ్యాన్ ఈ రికార్డులను అధిగమిస్తాడని ఫ్యాన్స్ ఆశతో ఉన్నారు. ఈ సమయంలో రోహిత్ గాయపడ్డాడన్న వార్త అభిమానులను కలవరపెడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement