Saturday, July 27, 2024

Test records | నాలుగో టెస్టులో హిట్ మ్యాన్‌ ముందు పలు రికార్డులు.. !

ఇంగ్లాండ్‌తో రాంచీ వేదికగా ఫిబ్రవరి 23 నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టు మ్యాచ్‌ 27 వరకు జరుగుతుంది. ఈ సిరీస్ లో భారత్ ఇప్పటికే 2-1 లీడ్ లో ఉంది. కాగా, ఇంగ్లాంత్‌తో జరగనున్న ఈ నాలుగో టెస్టు మ్యాచ్‌లో రోహిత్‌ను ఐదు రికార్డులు ఊరిస్తున్నాయి.

రోహిత్ ను ఊరిస్తున్న ఐదు రికార్డులు

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన 16 ఏళ్ల క్రికెట్ కెరీర్లో ఇప్పటి వరకు టెస్టుల్లో 3,977 పరుగులు చేశాడు.
కాగా, ఈ మ్యాచ్‌లో రోహిత్ మరో 23 పరుగులు చేస్తే టెస్టుల్లో 4 వేల పరుగుల మైలురాయిని దాటుతాడు.
ఇక, టెస్టుల్లో కెప్టెన్ గా వెయ్యి పరుగుల మార్క్ ను చేరుకోవడానికి 70 పరుగుల దూరంలో ఉన్నాడు.
టెస్టుల్లో ఇంగ్లాండ్ పై వెయ్యి పరుగులు పూర్తి చేయడానికి 13 పరుగుల దూరంలో నిలిచాడు.
మరో 7 సిక్సులు బాదితే…. ఇంటర్నేషనల్ క్రికెట్ లో 600 సిక్సులు కొట్టిన ఘనతను సాధిస్తాడు.
మరో 37 పరుగులు చేస్తే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 9 వేల పరుగులను పూర్తి చేసుకుంటాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement