Tuesday, May 21, 2024

YouTube | బెల్లంకొండ శ్రీనివాస్ సెన్షేనల్ రికార్డు..

బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘‘జయ జానకీ నాయక’’. 2017 లో రిలీజ్ అయిన ఈ సినిమా హిందీ వెర్షన్ ను యూట్యూబ్ లో అప్ లోడ్ చేయగా, అద్దిరిపోయే రెస్పాన్స్ తో దూసుకు పోతుంది. ఇప్పటి వరకూ 800 మిలియన్స్ కి పైగా హిందీ వెర్షన్ కి వ్యూస్ వచ్చాయి.

దీంతో యూట్యూబ్‌లో అత్యధిక మంది వీక్షించిన భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇది సెన్సేషన్ రెస్పాన్స్ అని చెప్పాలి. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా, జగపతి బాబు, జయరామ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement