Sunday, April 28, 2024

IPL : ఆర్ ఆర్ తో ఆర్సీబి ఢీ…మ్యాచ్ గెలిస్తే ముందుకు…

ఐపీఎల్ 2024 మ్యాచ్ లు తీవ్ర ఉత్కంఠ రేపుతూ క్రికెట్ అభిమానులను అలరిస్తున్నాయి. నేటి సాయంత్రం రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జైపూర్‌లోని సవాయ్ మన్ సింగ్ స్టేడియంలో పోటీ పడబోతున్నాయి. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.

- Advertisement -

ఈ సీజన్‌లో రాజస్థాన్‌కి ఇది నాలుగు, బెంగళూరుకు ఐదో మ్యాచ్‌ కానుంది. అయితే, అంతకు ముందు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ రాజస్థాన్‌ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. ఇక, బెంగళూరు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 ఓటములను చవి చూసింది.

అలాగే, ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు జట్లు మొత్తం 30 సార్లు పోటీ పడగా.. రాజస్థాన్ కంటే బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. ఇక, ఆర్సీబీ 15 మ్యాచ్‌లు గెలవగా, రాజస్థాన్ రాయల్స్ 12 మ్యాచ్‌ల్లో విజయాలను నమోదు చేసుకుంది. ఇక, 3 మ్యాచ్‌ల ఫలితం రాలేదు.. 2020 నుంచి రాజస్థాన్ vs బెంగళూరు మధ్య మొత్తం 9 మ్యాచ్‌లు జరగ్గా.. ఈ 9 మ్యాచ్‌ల్లో రాజస్థాన్ ఒక్క విజయం మాత్రమే నమోదు చేసింది. 2022లో పూణెలోని ఎంసీఏ స్టేడియంలో బెంగళూరుపై రాజస్థాన్ 29 రన్స్ తేడాతో విజయం సాధించింది.

ఇక, జైపూర్ పిచ్ వేదికగా ఆడిన రెండు మ్యాచ్‌లలో బ్యాటింగ్‌లకు మద్దతు ఇస్తుంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు దాదాపు 185 పరుగులకు పైగా స్కోర్ చేసింది. అయితే రెండు పర్యాయాలు తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు లక్ష్యాన్ని కాపాడుకుంది. ఇది సవాయ్ మన్ సింగ్ స్టేడియం పిచ్ ఆట సాగుతున్నప్పుడు ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉంటుంది. అయితే, ఇవాళ వర్షాలు కురిసే అవకాశం లేదు.. ఉష్ణోగ్రతలు సాయంత్రం 20 శాతం తేమతో 30 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

తుది జట్లు అంచనా:
రాజస్థాన్ జట్టు: సంజు శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, షిమ్రాన్ హెట్మెయర్, యశస్వీ జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, నాంద్రే బెర్గర్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ కృష్ణ, సందీప్ శర్మ.

బెంగళూరు జట్టు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, రజత్ పటీదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, యశ్ దయాల్, రీస్ టాప్లీ, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, లాకీ ఫెర్గూసన్.

Advertisement

తాజా వార్తలు

Advertisement