Sunday, April 28, 2024

BCCI: రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం పొడిగింపు

ముంబయి: భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ను బీసీసీఐ కొనసాగించనుంది. ఈ మేరకు ద్రవిడ్‌ పదవీకాలాన్ని పొడిగిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. రాహుల్‌తో పాటు ఇప్పటికే ఉన్న సహాయక సిబ్బంది పదవీకాలాన్ని కూడా బీసీసీఐ పొడిగించింది.

దీని ప్రకారం బ్యాటింగ్‌ కోచ్ విక్రమ్‌ రాఠోడ్, బౌలింగ్‌ కోచ్ పరాస్‌ మాంబ్రే, ఫీల్డింగ్‌ కోచ్ దిలీప్‌కు పొడిగింపు లభించినట్లైంది. అయితే, వీరు ఎప్పటి వరకు ఈ పదవిలో ఉంటారనేది మాత్రం బీసీసీఐ వెల్లడించలేదు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌, 2025లో ఛాంపియన్స్‌ ట్రోఫీ జరగనున్నాయి.

వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్‌షిప్‌లో టీమిండియా ఫైన‌ల్ చేరుకోవ‌డంలో ద్రావిడ్ పాత్ర ఎంతో ఉంది. అంతే కాకుండా ద్రావిడ్ కోచ్‌గా నియ‌మితుడైన త‌ర్వాతే వ‌న్డేలు, టెస్ట్‌ల‌తో పాటు టీ20ల్లో టీమిండియా నంబ‌ర్ వ‌న్ ర్యాంకును సొంతం చేసుకున్న‌ది. ఇటీవ‌ల వ‌ర‌ల్డ్ క‌ప్‌తో హెడ్ కోచ్‌గా ద్రావిడ్ ప‌ద‌వీకాలం ముగిసింది. దీంతో బీసీసీఐ ద్రావిడ్ పదవీకాలాన్ని పొడిగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement