Thursday, October 10, 2024

Vijaykanth : విష‌మంగా డీఎండీకే అధినేత, సీనియర్‌ నటుడు విజయ కాంత్ ఆరోగ్యం

గత 24 గంటలుగా డీఎండీకే అధినేత, సీనియర్‌ నటుడు విజయకాంత్ ఆరోగ్యం ఆందోళనకరంగా మారిందని చెన్నైకి చెందిన మాయాత్ హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. వారం రోజుల కిందట విజయకాంత్ తీవ్ర అస్వస్థతకు గురై నడవలేని పరిస్థితుల్లో ఉండగా కుటుంబ సభ్యులు ఆయనను చెన్నైకి చెందిన మాయాత్ హాస్పిటల్ కి తరలించారు.

గత వారం రోజుల నుంచి హాస్పిటల్ లోనే విజయకాంత్ చికిత్స పొందుతున్నారు. విజయకాంత్ దగ్గు, జలుబు, గొంతునొప్పితో బాధపడుతున్నందున సాధారణ వైద్య పరీక్షల కోసం వెళ్లినట్లు డీఎండీకే నేతలు అప్పట్లో వివరించారు. వారం రోజులపై నుంచి ఆయన హాస్పిటల్ లోనే చికిత్స పొందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement