Saturday, February 17, 2024

INDvsENG | మూడవ టెస్ట్‌కు రాహుల్ దూరం.. !

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్టు సిరీస్ ఈ నెల 15న (గురువారం) ప్రారంభం కానుంది. అయితే, ఈ సిరీస్‌ నుంచి ఇప్పటికే విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్ జట్టును వీడారు. దీంతో భారత టాపార్డర్‌కు గట్టి షాక్ తగిలింది. ఇక, గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్ ప్రస్తుతం మూడో టెస్టు కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడు. కేఎల్ రాహుల్‌తో పాటు రవీంద్ర జడేజా కూడా గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు.

అయితే ఫిట్‌నెస్ టెస్టులో జడేజాకు గ్రీన్ సిగ్నల్ లభించగా, రాహుల్ ఫిట్‌నెస్‌పై ఇంకా క్లారిటీ రాలేదు. ఇంగ్లాండ్‌తో జరగనున్న చివరి మూడు టెస్టు మ్యాచ్‌లకు రాహుల్ ఎంపికైనప్పటికీ.. సెలెక్టర్లు మరో వారం పాటు కేఎల్ రాహుల్ పరిస్థితిని పర్యవేక్షించి మ్యాచ్‌లో అతని ఉనికిని నిర్ణయిస్తారు. కాగా, రాజ్‌కోట్‌లో జరగనున్న మూడవ టెస్టు మ్యాచ్‌కు కేఎల్ రాహుల్ స్థానంలో దేవదత్ పడిక్కల్ ఎంపికైనట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement