Friday, May 3, 2024

IPL | ముంబయిపై పంజాబ్​ గెలుపు.. 13 పరుగుల తేడాతో విజయం

ఉత్కంఠగా సాగిన ఐపీఎల్​ మ్యాచ్​లో ఇవ్వాల పంజాబ్​ను విజయం వరించింది. రోహిత్​శర్మ (44), కెమరూన్​ గ్రీన్​ (67), సూర్యకుమార్​ యాదవ్​ (57) పోరాటం వృథా అయ్యింది. అయితే.. తొలుత బ్యాటింగ్​ చేసిన పంజాబ్​ పటిష్టమైన స్కోరు చేయడంతోపాటు.. బౌలింగ్​ విభాగంలోనూ మంచి ఆటతీరు కనబరిచింది. దీంతో నిర్ణీత ఓవర్లలో ముంబయిని కట్టడి చేసి ఆరు వికెట్లను పడగొట్టింది. అయితే.. ముంబయి చివరదాకా పోరాడినా ఫలితం దక్కలేదు. దీంతో పంజాబ్​ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.

215 టార్గెట్ ఛేద‌న‌లో రోహిత్ సేనను 201 ర‌న్స్‌కే క‌ట్ట‌డి చేసింది . అర్ష్‌దీప్ సింగ్ 20వ ఓవ‌ర్లో హ‌డ‌లెత్తించాడు. మూడో బంతికి తిల‌క్ వ‌ర్మ(3)ను బౌల్డ్ చేశాడు. మిడిల్ స్టంప్ విరిగి అవ‌త‌ల ప‌డింది. త‌ర్వాత బంతికి ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా వ‌చ్చిన నీహ‌ల్ వ‌ధేరా(0) కూడా అచ్చం అలానే బౌల్డ్ అయ్యాడు. టిమ్ డేవిడ్(9) క్రీజులో ఉన్నాడు.

భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో ముంబై ఇండియ‌న్స్‌కు ఆదిలోనే షాక్ త‌గిలింది. ఓపెన‌ర్ ఇషాన్ కిష‌న్‌(1) ఔట‌య్యాడు. ఆ త‌ర్వాత రోహిత్ శ‌ర్మ‌(44), కామెరూన్ గ్రీన్(67) దూకుడుగా ఆడారు. అయితే.. లివింగ్‌స్టోన్ రోహిత్‌ను ఔట్ చేయ‌డం వీళ్ల‌ 76 ప‌రుగుల భాగ‌స్వామ్యానికి తెర‌ప‌డింది. సూర్య‌కుమార్ యాద‌వ్(57), గ్రీన్ ధ‌నాధ‌న్ ఆడి స్కోర్‌బోర్డును ప‌రుగులు పెట్టించారు. ఆ త‌ర్వాత వ‌చ్చిన తిల‌క్ వ‌ర్మ‌(3) విఫ‌ల‌మ‌య్యాడు. పంజాబ్ బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్ నాలుగు వికెట్లు తీశాడు. నాథ‌న్ ఎల్లిస్, లివింగ్‌స్టోన్ ఒక వికెట్ ప‌డ‌గొట్టారు.

ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 214 ప‌రుగులు చేసింది. కెప్టెన్ సామ్ క‌ర‌న్‌(55, 29 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. హర్‌ప్రీత్ సింగ్ భాటియా(41) చెల‌రేగి ఆడారు. బెహ్రాన్‌డార్ఫ్ వేసిన 20వ ఓవ‌ర్‌లో జితేశ్ శ‌ర్మ‌(25) సిక్స్ కొట్టాడు. దాంతో పంజాబ్ స్కోర్ 200 దాటింది. నాలుగో బంతికి భారీ షాట్ ఆడ‌బోయి జితేశ్ బౌల్డ‌య్యాడు. ఆ త‌ర్వాత వచ్చిన హ‌ర్‌ప్రీత్ బ్రార్ ఫోర్ కొట్టాడు. దాంతో, పంజాబ్ 8 వికెట్ల న‌ష్టానికి 214 ప‌రుగులు చేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement