Thursday, April 25, 2024

పాక్‌ పైనే ప్రెషర్‌ ఉంటది: సన్నీ కామెంట్స్

భారత ఉపఖండంలో క్రికెట్‌ అభిమానులకు భారత్‌-పాకిస్థాన్‌ మధ్య జరిగే మ్యాచ్‌ ఓ యుద్ధంలాంటింది. ఫైనల్‌కు ముందు జరిగే ఫైనల్‌ అనే రీతిలో రెండు జట్లు తలపడతాయి. బరిలోకి దిగేముందు ఇరుజట్లు అంత కుముందు గణాంకాలను పక్కన పెడతాయి. గెలుపు కోసం ఆటగాళ్లు ఎంతవరకు వెళ్లినా అభిమానులు ఒప్పుకుంటారు..

కానీ ఓడిపోతే మాత్రం ససేమిరా అంటారు. పాక్‌ ఆటగాళ్లు గురించి మాట్లాడను కానీ భారత ఆటగాళ్లు మాత్రం చాలా సంవత్సరాలుగా వారికి ఇష్టమైన సంగీతాన్ని వింటూ ఆస్వాదిస్తున్నారు. మరోవైపు భారత్‌ను ఓడించాలనే ఒత్తిడి పాకిస్థాన్‌పై ఎక్కువగా ఉంటుంది. అది ఇప్పుడు కూడా అలానే ఉంది. కానీ భారత్‌ చాలాకాలం క్రితం నుంచి పాక్‌పై ఆధిపత్యం ప్రదర్శిస్తూ బాగా రాణిస్తోంది.

భారత ఆటగాళ్లు ఆస్ట్రేలియాపై ఇతర జట్ల కంటే ఎక్కువగా రాణించాలని కోరుకుంటారు. కొన్నేళ్లుగా ప్రపంచంలోని అత్యధిక జట్టును ఓడించిన జట్టుగా ఆసీస్‌కు పేరుంది. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌ల్లో భారత్‌ సునాయాసంగా గెలవడం కోహ్లీసేనకు మరింత బలమైన బూస్టర్‌గా చెప్పాలి. మెంటార్‌గా ధోనీ ఉనికి ఇప్పటికే ప్రశాంతంగా.. అంతే కూల్‌గా లక్ష్యాన్ని ఛేదించడంలో ఫలితాన్నిచ్చింది.

- Advertisement -

ఆరో బౌలర్‌పై ఇప్పటికీ కసరత్తు జరుగుతుంది. ప్రతి కెప్టెన్‌ బంతితోపాటు బ్యాట్‌తోనూ రాణించే ఆటగాడిని ఇష్టపడతాడు. తద్వారా సాధారణ బౌలర్లలో ఎవరికైనా ఆ రోజు కలసి రాకపోతే ఆ బౌలర్‌ కోటాను భర్తీచేయడానికి రెండు ఓవర్లు బౌలింగ్‌ చేయవచ్చు. హార్దిక్‌ పాండ్య వార్మప్‌ మ్యాచ్‌ల్లో బౌలింగ్‌ చేయలేదు కానీ అతడు కచ్చితంగా ఆరోబౌలర్‌గా ఉండే అవకాశం ఉంది.

పాకిస్థాన్‌కు యూఏఈలో ఆడిన గొప్ప అనుభవం ఉంది. అక్కడ పిచ్‌లు ఎలా మారతాయనేది వారికి పూర్తిగా తెలుసు. పాక్‌ బ్యాటింగ్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌, మహమ్మద్‌ రిజ్వాన్‌, హఫీజ్‌, షోయబ్‌ మాలిక్‌లపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. బౌలింగే వారి ప్రధాన బలం కావడంతో చిన్నపాటి స్కోరును వారు రక్షించుకోవడానికి ఇష్టపడతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement