Monday, April 29, 2024

పాండ్య చేసింది తప్పే: అకాశ్‌ చోప్రా

భారత్‌-వెస్టిండీస్‌ మధ్య జరిగిన మూడో టీ20లో టీమిండియా సారథి హార్దిక్‌ పాండ్య సిక్స్‌ కొట్టి మ్యాచ్‌ను ఫినీష్‌ చెశాడు. కానీ అదే సిక్స్‌ అతనిపై విమర్శలకు కారణమైంది. మంగళవారం జరిగిన మూడో టీ20లో భారత్‌ 7 వికెట్లతో ఘన విజయం సాధించింది. ముందు బౌలర్లు రాణించడంతో ప్రత్యర్థి విండీస్‌ జట్టును భారత్‌ 159 పరుగులకు కట్టడి చేసింది. అనంరం భారత్ లక్ష్యఛేదనకు దిగగా.. సిరీస్‌ కాపాడుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సూర్యకుమార్‌ (83) విజృంభించడంతో టీమిండియా గెలిచి టోర్నీలో నిలిచింది.

కానీ సూర్యతో కలిసి అద్భుత ఇన్నింగ్స్‌ ఆడని హైదరాబాదీ యువ సంచలనం తిలక్‌ వర్మ (49 నాటౌట్‌) పాండ్య కారణంగా ఒక పరుగుతో హాఫ్‌ సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. అవసరం లేకున్నా పాండ్య సిక్స్‌ కొట్టి మ్యాచ్‌ను పూర్తి చేశాడు. దీంతో పాండ్యపై విమర్శల వర్షం కురుస్తోంది. మాజీ క్రికెటర్‌ అకాశ్‌ చోప్రా సైతం పాండ్య చెసింది తప్పని అన్నాడు. తిలక్‌ వర్మకు అర్ధ సెంచరీ చేసే అవకాశం కల్పించాల్సింది. కానీ అతను అలా చేయకపోవడం అశ్చర్యపరిచిందని అకాశ్‌ పేర్కొన్నాడు.

- Advertisement -

పాండ్య స్వార్థపరుడు..

మరోవైపు పాండ్యపై క్రికెట్‌ అభిమానులు మండి పడుతున్నారు. యువ క్రికెటర్లకు ముందుండి నడిపించాల్సిన నాయకుడి లక్షణాలు పాండ్యలో లేవని అంటున్నారు. అతను స్వార్థపరుడని కావాలనే తిలక్‌ వర్మను హాఫ్‌ సెంచరీ చేయనివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 3వ టీ20లో టీమిండియా విజయానికి 160 పరుగులు అవసరం కాగా ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (1), శుభ్‌మాన్‌ గిల్‌ (6) తక్కువ స్కోరుకే పెవిలియన్‌ చేరుకున్నారు.

ఈ సమయంలో వైస్‌ కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (83: 44 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు), తిలక్‌ వర్మ (49 నాటౌట్‌; 37 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) అద్భుత బ్యాటింగ్‌తో టీమిండియాను ఆదుకున్నారు. అనంతరం సూర్య వెనుదిరగడంతో క్రీజులోకి అడుగుపెట్టిన భారత కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (20 నాటౌట్‌) సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు. కానీ అప్పటికి తిలక్‌ వర్మ 49 పరుగుల వద్ద ఉన్నాడు.

ఇంకా 13 బంతులు మిగిలి ఉండటంతో ఈ సిరీస్‌లో యువ క్రికెటర్‌ వరుసగా రెండో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకుంటాడని అందరూ భావించారు. క్లిష్ట సమయంలో సూర్య కుమార్‌కు అండగా నిలిచి ఆ తర్వాత కూడా జాగ్రత్తగా ఆడుతూ టీమిండియాను లక్ష్యంవైపు తీసుకెళ్లిన తిలక్‌ వర్మ పాండ్య కారణంగా తృటిలో అర్ధ శతకం మిస్‌ చేసుకున్నాడు. వర్మకు స్ట్రయిక్‌ ఇవ్వకుండా సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement