Friday, May 3, 2024

PAK Vs SA : సౌతాఫ్రికా టార్గెట్ 271 పరుగులు

చెన్నైలోని చిదంబరం స్టేడియంలో వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్థాన్ వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య 26వ వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన పాకిస్థాన్ జట్టు 46.4 ఓవర్లలో 270 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది.

పాకిస్థాన్ బ్యాట్స్ మెన్లు సౌద్ షకీల్ 52 పరుగులు, బాబర్ ఆజమ్ 50 పరుగులు, షాదబ్ ఖాన్ 43 పరుగులు, మహ్మద్ రిజ్వాన్ 31 పరుగులు, మహ్మద్ నవాజ్ 24 పరుగులు చేశారు. దీంతో సౌతాఫ్రికా విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే నిర్ణీత 50 ఓవర్లలో 271 పరుగులు చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement