Sunday, July 14, 2024

Pao Nurmi Games | నీరజ్‌కు స్వర్ణం..

పావొ నుర్మీ గేమ్స్‌లో భారత స్టార్‌ జావెలియన్‌ త్రోయర్‌ నిరాజ్‌ చోప్రా స్వర్ణం గెలుచుకున్నాడు. ఫిన్లాండ్‌ వేదికగా మంగళవారం జరిగిన ఈ పోటీల్లో నీరజ్‌ చోప్రా తన బళ్లెంను 85.97 మీటర్ల దూరం విసిరి తొలి స్థానంలో నిలిచాడు. ఒలింపిక్స్‌, వరల్డ్‌ చాంపియన్‌ నీరజ్‌ మరోసారి అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ పోటీలో చోప్రా (85.97మీ) బంగారు పతకం సొంతం చేసుకోగా.. స్థానిక అథ్లెట్లు టోనీ కెరానెన్‌ (84.19మీ) రజతం, ఒలీవర్‌ హెలాండర్‌ (83.96మీ) కాంస్య పతకాన్ని దక్కించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement