Friday, May 17, 2024

Men’s Hockey WC | రెండో మ్యాచ్‌లో భారత్ ఓటమి !

పురుషుల హాకీ 5 ప్రపంచకప్ ఇవ్వాల్టి నుంచి ప్రారంభమ‌య్యింది. ఒమన్ వేదిక‌గా జ‌రుగుతున్న ఈ టోర్నీలో భార‌త జ‌ట్టు త‌మ మొదటి మ్యాచ్‌లో ఘన విజయం సాధించగా.. రెండో మ్యాచ్ లో ఒట‌మి చ‌విచూసింది. గ్రూప్ దశలోని తమ మొదటి మ్యాచ్‌లో స్విట్జర్లాండ్‌పై 9-1 తేడాతో భారీ విజ‌యం సాధించింది భార‌త జట్టు.. రెండో మ్యాచ్‌లో ఈజిప్ట్‌తో తలపడగా.. 8–6 పాయింట్ల తేడాతో ఓటమి పాలయ్యింది.

పురుషుల FIH హాకీ 5s ప్రపంచ కప్‌లో భారత జట్టు ఈజిప్ట్, జమైకా, స్విట్జర్లాండ్‌లతో పాటు గ్రూప్ బీలో ఉంది. ఈ ప్రపంచ కప్‌లో మొత్తం 16 జట్లు ఆడనుండగా.. వాటిని 4 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ దశ ముగిసే సమయానికి ఒక్కో గ్రూపు నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు జనవరి 30న జరగే క్వార్టర్ ఫైనల్ & నాకౌట్స్‌కు చేరుకుంటాయి. ఇక 31న
(బుధవారం) ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement