Thursday, April 25, 2024

IPL | టాస్ గెలిచిన ల‌క్నో.. ధోనీ సేన‌ బ్యాటింగ్​

ఐపీఎల్‌లో ఇవ్వాల (సోమ‌వారం) చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జ‌రుగుతోంది. చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియం ఆతిథ్యమిస్తున్న ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్ లో ఓటమిపాలైన సీఎస్కే జట్టు సొంత గడ్డపై జరుగుతున్న ఈ మ్యాచ్ లో గెలిచి తీరాలని క‌సిగా ఉంది.

గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్ తప్ప మిగ‌తావారు ఆశించిన స్థాయిలో రాణించ‌లేదు. ఈసారి బ్యాటింగ్ వైఫల్యాలకు చోటివ్వరాదని ధోనీ అండ్ టీమ్‌ భావిస్తోంది. మరోవైపు.. ఇప్పటికే తొలి మ్యాచ్ లో నెగ్గిన లక్నో జట్టు చెన్నైపైనా అదే ఒరవడి కొనసాగించాలని భావిస్తోంది. దీంతో ఇవాళ్టి మ్యాచ్ కూడా హోరాహోరీగా సాగే అవకాశాలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement