Monday, April 29, 2024

Kohli : మిచెల్ జాన్సన్ ను వ‌దిలేది లే… కోహ్లీ

మైదానంలో విరాట్ కోహ్లి జోలికి వెళ్లొద్దని ప్రత్యర్థి ఆటగాళ్లకు మాజీ క్రికెటర్లు, సీనియర్లు తరుచూ సూచిస్తుంటారు. కవ్విస్తే ఇతర ఆటగాళ్లు తమ లయను కోల్పోయి తప్పులు చేసే ప్రమాదం ఉంటుంది. కానీ కోహ్లి విషయంలో మాత్రం అలా జరగదు. అతను మరింత ఫోకస్‌తో ఆడతాడు. ప్రత్యర్థిపై ఓ యుద్ధాన్ని కోహ్లి ప్రకటిస్తాడు. విరాట్‌ను రెచ్చగొట్టిన కొందరు బౌలర్లు భారీ మూల్యం చెల్లించుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి.

- Advertisement -

వాటిలో ఆస్ట్రేలియా-2014 పర్యటనలో కోహ్లి – మిచెల్ జాన్సన్ మధ్య జరిగిన ఫైట్‌ను క్రికెట్ అభిమానులు అంత ఈజీగా మరిచిపోలేరు. అప్పటివరకు కంగారూల గడ్డపై ఏ విదేశీ ఆటగాడు అంతలా చెలరేగలేదు. ఆస్ట్రేలియా హోమ్‌గ్రౌండ్‌లో ఆస్ట్రేలియన్లకు కోహ్లి చుక్కలు చూపించాడు. అయితే ఆ సిరీస్‌లో ఉద్వేగంతో ఆడటానికి గల కారణాలను కోహ్లి తాజాగా వివరించాడు. జాన్సన్ తన తల మీదకు బంతిని విసిరినప్పుడు తన ఆలోచనలు ఎలా మారాయో తెలిపాడు.

”ఆ పర్యటనలో అదే తొలి టెస్టు. నేను ఎదుర్కొన్న తొలి బంతి అదే. జాన్సన్ నా తలపై బంతితో కొట్టాడు. దాన్ని నేను నమ్మలేకపోయా. ఆస్ట్రేలియా పర్యటనలో ఎలా ఆడాలో గత 60 రోజులుగా ఓ ప్రణాళిక వేసుకున్నా. కానీ జాన్సన్ వల్ల నా ప్లాన్ మొత్తాన్ని ఛేంజ్ చేశాను. బంతి బలంగా తాకింది. చూపు నెమ్మదిగా మందగించినట్లు అనిపించింది. అంతేగాక వాపు కూడా వచ్చింది. అప్పుడు లంచ్ విరామానికి మరో రెండు బంతులు మాత్రమే ఉన్నాయి”

”ఈ సంఘటన నాకు మేలు చేసింది. ఆ సందర్భంలో నాకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఫైట్ లేదా ఫ్లైట్.. పోరాడు లేదా పక్కకు తప్పుకో. సాధారణంగా నా రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసు. అతడు నా తలపై ఎలా కొడతాడు? ఈ సిరీస్‌లో అతడిని వదిలిపెట్టవద్దు. అతనిపై ప్రతిదాడికి దిగాలని నిర్ణయించుకున్నా అదే చేశాను” అని కోహ్లి తెలిపాడు. ధోనీ గైర్హాజరీలో కెప్టెన్సీ చేసిన కోహ్లి ఆ మ్యాచ్‌లో 115, 141 పరుగులు సాధించాడు. కానీ టీమిండియా 48 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ సిరీస్‌లో విరాట్ 86 సగటుతో 692 పరుగులు చేశాడు. కాగా, కోహ్లి ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆర్సీబీ తరఫున ఆడుతున్నాడు.ఈ సీజన్‌లో ఇప్పటివరకు 319 పరుగులు చేసిన కోహ్లి ఆరెంజ్ క్యాప్ రేస్ లో టాప్ లో ఉన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement