Friday, May 10, 2024

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌, టాప్‌-10లో ఇషాన్‌ కిషన్‌.. వన్డేలో కోహ్లీ 3, రోహిత్‌ 4 స్థానాలు

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ క్రికెటర్‌ ఇషాన్‌ కిషన్‌ అదరగొట్టేశాడు. టీ20 ర్యాంకింగ్స్‌లో 68 స్థానాలు ఎగబాకి 689 పాయింట్లతో టాప్‌-10లో స్థానం సంపాదించాడు. టీ20 టాప్‌-10 బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో నిలిచిన ఏకైక భారత ఆటగాడి నిలిచాడు. ఇషాన్‌ కిషన్‌ తర్వాత స్థానాల్లో కెఎల్‌ రాహుల్‌ (14), రోహిత్‌ శర్మ (16), శ్రేయస్‌ అయ్యర్‌ (17), విరాట్‌ కోహ్లీ (21) స్థానాల్లో నిలిచారు. 818 పాయింట్లతో పాక్‌ క్రికెటర్‌ బాబర్‌ ఆజామ్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. బౌలింగ్‌ విభాగంలో భువనేశ్వర్‌ కుమార్‌ 11వ స్థానంలో యుజ్వేందర్‌ చాహల్‌ 26కు చేరాడు. ఆస్ట్రేలియా క్రికెటర్‌ హేజిల్‌వుడ్‌ 792 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఉత్తమ టీ20 ఆల్‌రౌండర్‌గా అఫ్గనిస్తాన్‌కు చెందిన మహమ్మద్‌ నబీ నిలిచాడు. టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ జో రూట్‌ సత్తా చాటాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న రూట్‌ టెస్టుల్లో మరోసారి అగ్రస్థానానికి ఎగబాకాదు. 897 పాయింట్లతో టాప్‌లో నిలిచాడు. ఆతర్వాత ఆసీస్‌ ఆటగాడు లబూషేన్‌ 892 పాయింట్లతో కొనసాగుతున్నాడు.

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 754 పాయింట్లతో 8వ స్థానంలోనూ, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 742 పాయింట్లతో 10వ స్థానంలో నిలిచారు. బౌలర్ల జాబితాలో ఆసీస్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ 901 పాయింట్లతో టాప్‌-10లో అగ్రస్థానంలో నిలవగా, టీమిండియా దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ రెండో స్థానంలో నిలిచాడు. భారత్‌ ఫేస్‌ గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా, పాక్‌ స్పీడ్‌గన్‌ షాహీన్‌ అఫ్రిది 3, 4 స్థానాలకు ఎగబాకారు. వన్డే ర్యాంకింగ్స్‌లో 811 పాయింట్లతో విరాట్‌ కోహ్లీ, 791 పాయింట్లతో రోహిత్‌ శర్మ 3, 4 స్థానాల్లో నిలిచారు. బౌలింగ్‌లో 679 పాయింట్లతో బుమ్రా ఒక్కటే టాప్‌-10లో నిలిచాడు. టాప్‌ బ్యాటర్‌గా 892 పాయింట్లతో పాక్‌ క్రికెటర్‌ బాబర్‌ అజామ్‌ కొనసాగుతున్నాడు. 726 పాయింట్లతో న్యూజిలాండ్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్డ్‌ టాప్‌-10లో అగ్రస్థానంలో నిలిచాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement