Tuesday, May 21, 2024

హైదరాబాద్‌లో అంతర్జాతీయ హ్యాండ్‌బాల్‌ అకాడమీ..

భారత హ్యాండ్‌బాల్‌కు హైదరాబాద్‌ హబ్‌ కాబోతుంది. హైదరాబాద్‌లో అంతర్జాతీయ హ్యాండ్‌బాల్‌ అకాడమీ ఏర్పాటుకు అన్ని విధాల సహాయ, సహకారాలు అందించేందుకు ఇంటర్నేషనల్‌ హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ (ఐహెచ్‌ఎఫ్‌) ముందుకొచ్చింది. భారత్‌లో హ్యాండ్‌బాల్‌ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ఐహెచ్‌ఎఫ్‌ ప్రెసిడెంట్‌ హసన్‌ ముస్తాఫాతో జాతీయ హ్యాండ్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు సౌదీ అరేబియాలో మంగళవారం భేటీ అయ్యారు. దేశంలో హ్యాండ్‌బాల్‌ క్రీడకు అవసరమైన సౌకర్యాల కల్పన, కోచ్‌ల సంఖ్య పెంపు, భారత్‌కు అంతర్జాతీయ టోర్నమెంట్ల కేటాయింపుపై ఈ సమావేశం జరిగింది. జగన్‌మోహన్‌రావు వినతిని సావధానంగా ఆలకించిన ముస్తాఫా భారత్‌లో హ్యాండ్‌బాల్‌ పురోగతికి తమవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

దీనిలో భాగంగా హైదరాబాద్‌లో నిర్మించనున్న అంతర్జాతీయ హ్యాండ్‌బాల్‌ అకాడమీ ఏర్పాటుకు నిధులు, సాంకేతిక పరిజ్ఞానంతోపాటు ఇతర అంశాల్లో తోడ్పాటు అందించేందుకు ముస్తాఫా సుముఖత వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 500మంది హ్యాండ్‌బాల్‌ కోచ్‌ల నియామకాలు, గేమ్‌ టెక్నిక్స్‌పై తర్ఫీదును ఇచ్చేందుకు ఆన్‌లైన్‌ శిక్షణ ఇచ్చేందుకు ఆన్‌లైన్‌ సమావేశాల ఏర్పాటు, ఈ ఏడాది చివర్లో ఆసియా బాలికల హ్యాండ్‌బాల్‌ పోటీలకు భారత్‌ ఆతిథ్య హక్కుల కేటాయింపునకు ముస్తాఫా అంగీకరించారు. ఈ సమావేశంలో భారత ఒలింపిక్‌సంఘం కోశాధికారి ఆనంద్‌పాండే, ఆసియా హ్యాండ్‌బాల్‌ పెడరేషన్‌ ఈడీ అహ్మద్‌ అబు తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement