Tuesday, October 8, 2024

India vs Netherlands – టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్

వన్డే వరల్డ్‌కప్‌-2023లో టీమిండియా తమ అఖరి లీగ్‌ మ్యాచ్‌ ఆడేందుకు సిద్దమైంది. ఆదివారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌తో భారత జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ లో భార‌త్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.. కాగా టీమ్ ఇండియా జ‌ట్టులో ఎటువంటి మార్పులు లేకుండానే దిగుతున్న‌ది..కాగా, ఈ మ్యాచ్‌లో డచ్‌ జట్టును చిత్తు చేసి రెట్టింపు ఆత్మవిశ్వాసంతో సెమీఫైనల్‌ బరిలోకి దిగాలని టీమిండియా భావిస్తోంది. డచ్‌తో మ్యాచ్‌ కోసం నెట్స్‌లో రోహిత్‌ సేన తీవ్రంగా శ్రమించింది.

భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్ (వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్‌ యాదవ్, రవీంద్ర జడేజా, షమీ, కుల‌దీప్ యాద‌వ్ , మహ్మద్ సిరాజ్, బూమ్రా..

Advertisement

తాజా వార్తలు

Advertisement