Monday, April 29, 2024

India vs Ausis – ఆసీస్ బౌల‌ర్ల‌ను ఉతికి ‘ఆరే’సిన ఇండియ‌న్ బ్యాట‌ర్స్…. …… భార‌త్ 399/5

ఇండోర్ : భార‌త్ – ఆసీస్ మ‌ధ్య జ‌రుగుతున్న రెండో వ‌న్డే మ్యాచ్ లో భార‌త్ బ్యాట‌ర్స్ ఆసీస్ బౌల‌ర్ ల‌ను చిత‌కొట్టారు.. 50 ఓవ‌ర్ లో భార‌త్ ఏకంగా 399 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది.. ఆసీస్ విజ‌యం సాధించాలంటే 50 ఓవ‌ర్ల‌లో 400 ప‌రుగులు చేయాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో శ్రేయ‌స్, శుభమ‌న్ గిల్ లు శ‌త‌కాల‌తో క‌దం తొక్క‌గా, కెఎల్ రాహుల్, సూర్య‌కుమార్ లు అర్ధ‌శ‌త‌కాల‌తో రాణించారు.. సూర్య కుమార్ సిక్స‌ర్లు, ఫోర్ల‌తో ఫైన‌ల్ ట‌చ్ ఇచ్చాడు..

ఆట ప్రారంభంలో 8 ప‌రుగులు చేసిన రుతురాజ్ హాజిల్ వుడ్ బౌలింగ్ లో తొలి వికెట్ గా అవుట‌య్యాడు… 16 ప‌రుగులు వ‌ద్ద తొలి వికెట్ ప‌డిన అనంత‌రం క్రీజ్ లోకి వ‌చ్చిన శ్రేయ‌స్ దూకుడుగా బ్యాటింగ్ ప్రారంభించాడు.. ఫోర్ల లో ఆసీస్ బౌల‌ర్ల‌కు షాక్ ఇచ్చాడు.. కేవ‌లం 86 బంతుల‌లోనే వంద ప‌రుగులు పూర్తి చేసుకున్నాడు.. ఈ శ‌త‌కంలో 11 ఫోర్లు, మూడు సిక్స్ లు ఉన్నాయి.. అనంత‌రం 105 ప‌రుగుల చేసిన అయ్యర్ ను అబాట్ ఔట్ చేశాడు.. గిల్,అయ్య‌ర్ లు రెండో వికెట్ కి 200 ప‌రుగులు జోడించ‌డం విశేషం. .


ఓపెన‌ర్ శుభ‌మ‌న్ గిల్ 104 పరుగులు చేసి మూడో వికెట్ గా వెనుతిరిగాడు.. 97 బంతుల‌లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్స‌ర్ ల‌తో ఈ స్కోర్ ను సాధించాడు.. గ్రీన్ బౌలింగ్ లో క్యారీకి క్యాచ్ ఇచ్చి అవుట‌య్యాడు.

ఇక ఇషాన్ కిష‌న్ 18 బంతుల‌లో 32 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. ఈ స్కోర్ లో రెండు ఫోర్లు, రెండు సిక్స్ ర్లు ఉన్నాయి..

కెప్టెన్ రాహుల్ 52 ప‌రుగుల చేసి గ్రీన్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. 38 బంతుల‌లో మూడు ఫోర్లు, మూడు సిక్స‌ర్ల‌తో ఈ స్కోర్ సాధించాడు..

- Advertisement -

ఇక సూర్య‌కుమార్ ధ‌నాథ‌న్ ఇన్నింగ్స్ ఆడాడు. పోర్లు, సిక్స‌ర్ల‌తో స్టేడియంలో మోత‌మోగించాడు. 37 బంతుల‌లో 72 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ స్కోర్ లో ఆరు ఫోర్లు, ఆరు సిక్స్ లు ఉన్నాయి..

జ‌డేజా 13 ప‌రుగుల‌తో నాటౌట్ గా మిగిలాడు.

అసీస్ బౌల‌ర్ల‌లో గ్రీన్ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా ,హ‌జిల్ ఉడ్, అబాట్, ఆడ‌మ్ జంపాకు ఒక్కో వికెట్ ల‌భించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement