Saturday, May 4, 2024

India vs Ausis ఇండోర్ వ‌ర్షం…ఆగిన మ్యాచ్ …భార‌త్ 79/1

ఇండోర్ : భార‌త్ – ఆసీస్ మ‌ధ్య జ‌రుగుతున్న రెండో వ‌న్డే మ్యాచ్ ను వ‌రుణుడు అడ్డుకున్నాడు… 9.5 ఓవ‌ర్ల‌లో ఒక వికెట్ న‌ష్టానికి 79 ప‌రుగులు చేసి ఆడుతున్న స‌మ‌యంలో వ‌ర్షం ప్రారంభ‌మైంది.. దీంతో మ్యాచ్ ను నిలిపివేశారు.. శ్రీయ‌స్ 34, గిల్ 32 పరుగుల‌తో క్రీజ్ లో ఉన్నారు..అంత‌కుముందు 8 ప‌రుగులు చేసిన రుతురాజ్ హాజిల్ వుడ్ బౌలింగ్ లో తొలి వికెట్ గా అవుట‌య్యాడు.. అప్ప‌టికి భార‌త్ స్కోర్ 3.4 ఓవ‌ర్ల‌లో 16 ప‌రుగులు. అంత‌కు ముందు టాస్ నెగ్గిన ఆసీస్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. భారత్‌కు బ్యాటింగ్‌ అప్పగించింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ జట్టును స్టీవ్‌ స్మిత్‌ నడిపించనున్నాడు. తొలివ‌న్డే ను గెలుచుకున్న భార‌త్ ఈ మ్యాచ్ ను సైతం గెల‌వాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉంది.. కాగా బుమ్రా స్థానంలో తుది జట్టులోకి ప్రసిద్ధ్‌ను తీసుకున్నారు.

భారత జట్టు: గిల్‌, గైక్వాడ్‌, శ్రేయస్‌, కేఎల్‌ రాహుల్‌(కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌, జడేజా, అశ్విన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, షమీ, ప్రసిద్ధ్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement