Sunday, April 28, 2024

Ind vs Eng : రోహిత్, సర్ఫరాజ్ ధనాధన్ బ్యాటింగ్.. భారీ స్కోర్ దిశగా భారత్

రాజ్ కోట్ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ, బ్యాట్స్ మెన్ సర్ఫరాజ్ ధనాధన్ బ్యాటింగ్ చేయడంతో భారీ స్కోరు దిశగా భారత్ దూసుకెళ్తోంది.

ముందుగా ఉదయం ఆట ప్రారంభం కాగానే తక్కువ స్కోర్ కే మూడు వికెట్లు కోల్పోగా ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీ చేసి ఔటయ్యాడు. ఆతర్వాత వచ్చిన సర్ఫరాజ్ ధనాధన్ బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ చేసి ఔటయ్యాడు. సర్ఫరాజ్ ఔటయ్యాక రవీంద్ర జడేజా సెంచరీ పూర్తి చేశాడు. ఇలా ఇద్దరు సెంచరీలు, ఒకరు హాప్ సెంచరీలు చేయడంతో భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు 86ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి రవీంద్ర జడేజా 110 పరుగులు, కుల్దీప్ యాదవ్ ఒక్క పరుగుతో నాటౌట్ గా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement