Saturday, November 9, 2024

Ind vs Eng, 2nd Test : జైస్వాల్ ద్విశతకం.. భారత్ 396 పరుగులకు ఆలౌట్…

విశాఖ‌ప‌ట్నంలోని వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియంలో భార‌త్ వ‌ర్సెస్ ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 112 ఓవర్లలో 396 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

ఈ మ్యాచ్ లో భారత్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ (209) పరుగులు చేయగా… శుభమన్ గిల్ 34పరుగులు, పటిదార్ 32పరుగులు, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ చెరో 27 పరుగులు, రవిచంద్రన్ అశ్విన్ 20 పరుగులు చేశారు. రెండో రోజు ఆట ప్రారంభించి లంచ్ బ్రేక్ సమయం కంటే ముందే భారత్ జట్టు 396 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement