Wednesday, May 1, 2024

IND vs AUS: నేడు భారత్, ఆస్ట్రేలియా నాల్గవ T20..

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇవాళ నాల్గవ T20 ఇంటర్నేషనల్‌ మ్యాచ్ జరగనుంది. రాయ్‌పూర్‌లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇవాళ జరగనున్న ద్వైపాక్షిక సిరీస్‌లో 4వ T20I కోసం సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడనుంది.

ఆస్ట్రేలియన్లు 223 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే సమయంలో గెలిచిన మూడవ మ్యాచ్‌లో చివరి రెండు ఓవర్లలో 40 ప్లస్ పరుగులను డిఫెండ్ చేయకపోవడం ద్వారా టీమిండియా ఓటమిపాలైంది. ఈ క్రమంలో ఈ మ్యాచులో ఎలాగైనా గెలవాలని భారత్ జట్టు భావిస్తోంది. మరోవైపు ఇప్పటికే ఓ మ్యాచ్ గెల్చిన ఆసీస్ జట్టు దీనిలో కూడా విజయం సాధించాలని చూస్తోంది. అయితే ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనేది తెలియాలంటే ఈరోజు రాత్రి మ్యాచ్ చూడాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement