Thursday, April 25, 2024

ఐసీసీ కొత్త రూల్స్‌.. ఉమ్మిపై శాశ్వత నిషేధం, అక్టోబర్‌ 1నుంచి అమలు

అంతర్జాతీయ క్రికెట్‌లో కొన్ని నియమాలను మార్చుతున్నట్లు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) మంగళవారం ప్రకటించింది. కొత్త రూల్స్‌ అక్టోబర్‌ 1నుంచి అమల్లోకి రానున్నాయి. క్రీడాకారుల ప్రవర్తనా నియమావళిలో మార్పులు కోరుతూ సౌరభ్‌ గంగూలీ నేతృత్వంలోని పురుషుల క్రికెట్‌ కమిటీ చేసిన సిఫార్సులకు చీఫ్‌ ఎగ్జిక్టూటివ్‌ కమిటీ ఆమోదం తెలిపింది. ఆస్ట్రేలియా వేదికగా జరిగే ప్రపంచకప్‌ టీ20 టోర్నీలో కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి.

కొత్త నిబంధనలు..

  • బ్యాటర్‌ క్యాచ్‌ అవుట్‌ అయితే, స్ట్రయికర్‌ స్థానంలోకి కొత్త బ్యాటర్‌ వస్తారు. క్యాచ్‌పట్టే సమయంలో బ్యాటర్లు ఒకరినొకరు క్రాస్‌ చేసినా లెక్కలోకి తీసుకోరు. ఇప్పటి వరకు ఈ రూల్‌ భిన్నంగా ఉండేది. బ్యాటర్లు క్రాస్‌అయితే కొత్త బ్యాటర్‌ నాన్‌స్ట్రయికర్‌ ఎండ్‌లోకి వచ్చేవాడు.
  • బంతికి ఉమ్మి రాయడాన్ని శాశ్వతంగా నిషేధించారు. ప్రస్తుతం తాత్కాలిక నిషేధాజ్ఞలు మాత్రమే అమల్లోఉన్నాయి. కరోనా నిబంధన కారణంగా గత రెండేళ్లుగా ఈ విధానం అమలవుతూ ఉన్నది.
  • టెస్టులు, వన్డేల్లో ఇన్‌కమింగ్‌ బ్యాటర్‌ రెండు నిముషాల్లో స్ట్రయిక్‌ తీసుకోవాలి. టీ20ల్లో ఇది 90 సెకన్లుగా ఉంది. సమయంలోగా క్రీజ్‌లోకి రాకుంటే ప్రత్యరథ
  • బౌలర్‌ బౌలింగ్‌ చేస్తున్న సమయంలో, ఫీల్డింగ్‌లో ఉద్దేశపూర్వకమైన, అనైతిక కదలికలు చోటుచేసుకుంటే ఆ బంతిని డెడ్‌బాల్‌గా ప్రకటిస్తారు. బ్యాటింగ్‌ జట్టుకు ఐదు పరుగులు పెనాల్టిగా లభిస్తాయి.
  • మన్కడింగ్‌ రూపంలో చేసే రనౌట్‌ను అన్‌ఫెయిర్‌ ప్లే సెక్షన్‌ నుంచి రన్‌ అవుట్‌ సెక్షన్‌లోకి మార్చారు.
  • బౌలర్‌ బంతిని వేయకముందే బ్యాటర్‌ వికెట్ల నుంచి ముందుకు కదలితే, బంతిని విసిరి స్ట్రయికర్‌ను రనౌట్‌ చేసేవారు.ఇప్పుడు ఇలాంటి ప్రయత్నాలు కుదరవు. అలా ప్రయత్నిస్తే డెడ్‌బాల్‌గా ప్రకటిస్తారు.
  • టీ20ల్లో జనవరి 2022లో ప్రవేశపెట్టిన మ్యాచ్‌ పెనాల్టిని ఇకపై వన్డేలకు వర్తింపజేయనున్నారు. దీంతో వన్డేల్లోనూ నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తిచేయకుంటే, మిగతా ఓవర్లలో బౌండరీ దగ్గర నుంచి 30 అడుగుల సర్కిల్‌లోకి ఫీల్డరను రప్పించాల్సి ఉంటుంది.
  • బంతిని ఆడేసమయంలో బ్యాటర్‌ లేదా బ్యాట్‌ పిచ్‌పైనే ఉండాలి. అలా కాకుండా పిచ్‌ బయటకు వచ్చి ఆడితే దానిని డెడ్‌బాల్‌గా పరిగణిస్తారు. ఒకవేళ బ్యాటర్‌ను పిచ్‌ బయటకు వచ్చేలా బౌలర్‌ ప్రేరేపిస్తే ఆ బంతిని నో బాల్‌గా ప్రకటిస్తారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement