Thursday, June 1, 2023

స్మృతి మంధాన 2వ ర్యాంక్‌.. ఆస్ట్రేలియ క్రికెట‌ర్ మెగ్‌లానింగ్ మూడో స్థానం

ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత బ్యాట్స్‌ఉమన్‌ స్మృతి మంధాన ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రెండవ స్థానాన్ని చేరుకుంది. ఆస్ట్రేలియా దిగ్గజం మెగ్‌లానింగ్‌ను మూడవ స్థానానికి నెట్టింది. మరొక ఆస్ట్రేలియన్‌ బెత్‌ మూనీ నవంబర్‌ 1 ర్యాంకులో కొనసాగుతున్నది. మంగళవారం విడుదల చేసిన తాజా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో మూనీ 743 పాయింట్లతో టాప్‌ బ్యాట్స్‌ఉమన్‌గా ఉండగా, 731 పాయింట్లతో మంధాన రెండవ స్థానంలో, 725 పాయింట్లతో లానింగ్‌ మూడవ స్థానంలో ఉన్నారు.

- Advertisement -
   

ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో మంధాన 111 పరుగులు చేసింది. భారత యువ ఓపెనర్‌ షఫాలీ 666 పాయింట్లతో ఆరవ స్థానంలో ఉంది. హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (9), యాస్తిక భాటియా (37) తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు. బౌలర్ల జాబితాలో భారత స్పిన్నర్‌ దీప్తిశర్మ 12వ స్థానానికి ఎగబాకింది. ఆల్‌రౌండర్ల జాబితాలో ఆస్ట్రేలియా వెటరన్‌ ఎల్లిస్‌ పెర్రీ టాప్‌ ర్యాంక్‌ను కోల్పోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement