Monday, April 29, 2024

South Africa : ఓ ఇంటివాడైన డెవిడ్ మిల్ల‌ర్ …

దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ డేవిడ్ మిల్లర్ ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల ప్రేయసి కెమిల్లా హారిస్‌ను మిల్లర్‌ ఆదివారం పెళ్లి చేసుకున్నాడు. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న మిల్లర్‌, కెమిల్లాలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని కెమిల్లా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు.

- Advertisement -

పెళ్లికి సంబంధించిన ఫోటోలను కెమిల్లా షేర్‌ చేశారు. ఈ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేప్ టౌన్ వేదికగా జరిగిన డేవిడ్ మిల్లర్, కెమిల్లా హారిస్‌ల వివాహానికి పలువురు దక్షిణాఫ్రికా క్రికెటర్లు హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు మరియు శ్రేయోభిలాషులు ఈ నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement