Sunday, April 28, 2024

Hockey WC | భార‌త జ‌ట్టుకు ఎదురుదెబ్బ‌… రెండో మ్యాచ్‌లో ఓట‌మి

FIH జూనియర్ వరల్డ్ కప్ 2023లో కొరియాతో జ‌రిగిన మొద‌టి మ్యాచ్ లో శుభారంభం చేసిన‌ భారత పురుషుల జూనియర్ హాకీ జట్టుకు… ఇవ్వాల జ‌రిగిన‌ రెండో మ్యాచ్ లో ఎదురు దెబ్బ త‌గిలింది. మలేషియాలోని నేషనల్ హాకీ స్టేడియంలో జ‌రిగిన రెండవ గ్రూప్ గేమ్ లో ఓట‌మిపాలైంది. స్పెయిన్‌తో జ‌రిగిన ఈ మ్యాచ్‌లో 1-4 పాయింట్ల‌ తేడాతో ఓడిపోయింది. దీంతో పాయింట్ల ప‌ట్టిక‌లో భార‌త్ మూడ‌వ స్థానానికి ప‌డిపోగా.. వ‌రుసగా రెండు విజ‌యాల‌తో స్పెయిన్ అగ్రస్థానంలో కొన‌సాగుతొంది. ఇక శనివారం కెనడాతో జర‌గనున్న చివరి మూడ‌వ‌ గ్రూప్ గేమ్‌లో పుంజుకుని క్వార్ట‌ర్ ఫైన‌ల్స్ కి చేరుకోవాల‌ని భావిస్తొంది భారత్.

Advertisement

తాజా వార్తలు

Advertisement