Sunday, October 13, 2024

AP | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదలకు ఆదేశాలు జారీ చేసింది జ‌గ‌న్ స‌ర్కార్. 897 పోస్టులు భర్తీ చేయనుంది ఏపీఎస్పీ. ఇందులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు 331, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 566 ఉన్నాయి. డిసెంబర్ 21 నుంచి జనవరి 10 వరకు ధరఖాస్తుల స్వీకరణ జ‌ర‌గ‌నుండ‌గా.. ఫిబ్రవరి 25 ప్రిలిమనరీ పరీక్ష నిర్వహించ‌నున్నారు. గ్రూప్-2 నోటిఫికేష‌న్ విడుద‌ల‌తో ఏపీ నిరుద్యోగులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

వివిధ విభాగాల్లో గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి ఇవాళే నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు ఏపీపీఎస్సీ సభ్యుడు సుధీర్ ఎక్స్ లో తెలిపారు. నియామక ప్రక్రియను త్వరగా ప్రారంభించి, నిర్ణీత గడువులోగా ముగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఆయన చెప్పినట్లుగానే నోటిఫికేషన్ విడుదలైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement