Monday, May 20, 2024

HCA స‌మ్మ‌ర్ క్యాంప్స్… షెడ్యూల్ రిలీజ్

యువ క్రికెటర్లకు గుడ్ న్యూస్…. హెచ్‌సీఏ సమ్మర్‌ క్యాంపుల షెడ్యూల్‌ విడుదలైంది. రేప‌టి నుంచి (15వ తేదీ నుంచి) 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నెల 20 నుంచి 30 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఉంటుంది. ఈ క్యాంప్‌లో క్రికెట‌ర్ల‌కు ఉచిత శిక్ష‌ణ‌తో పాటు పౌష్ఠికాహారం అందిస్తారు.

ఒక్కో శిబిరంలో 80 నుంచి 100 మంది పిల్లలకు అవకాశం ఉంటుంది. అండర్‌-14, 16, 19 ఏళ్ల వయస్సులో బాలురకు, అండర్‌-15, 19 బాలికలకు విభాగాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్షనపల్లి జగన్‌ మోహన్‌రావు వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం హెచ్‌సీఏ అధికారిక వెబ్‌సైట్ http://hycricket.org ని సందర్శించవచ్చని హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్షనపల్లి జగన్ మోహన్ రావు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement