Friday, June 14, 2024

FIH Hockey 5 WC | ఈ నెల 27 నుంచి హాకీ ప్ర‌పంచ క‌ప్.. జ‌ట్ల వివ‌రాలివే !

ఒమన్‌లోని మస్కట్‌లో జరగనున్న ఎఫ్‌ఐహెచ్ హాకీ5 ప్రపంచకప్‌కు హాకీ ఇండియా భారత జట్లను ఎంపిక చేసింది. ఈ ప్ర‌పంచక‌ప్ లో ప‌రుషుల జ‌ట్టుకు సిమ్రంజీత్ సింగ్ నాయ‌క‌త్వం వ‌హించనుండగా… భారత మహిళల జట్టుకు రజనీ ఎటిమార్పు నాయకత్వం వహించనుంది. ఇక, హాకీ5 మహిళల ప్రపంచ కప్ జనవరి 24, 27 మధ్య జరగనుండగా, పురుషుల ఈవెంట్ జనవరి 28 నుండి జనవరి 31 వరకు జరగనుంది.

భార‌త‌ మహిళల జట్టు..

భారత మహిళల జట్టుకు గోల్‌కీపర్ రజనీ ఎటిమార్పు నాయకత్వం వహిస్తుండగా, డిఫెండర్ మహిమా చౌదరి వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. జట్టులో బన్సారీ సోలంకి రెండవ గోల్ కీపర్‌గా ఉన్నారు. అక్షతా అబాసో ధేకాలే, జ్యోతి ఛత్రి డిఫెండర్లుగా ఉన్నారు. మిడ్‌ఫీల్డర్లలో మరియానా కుజుర్, ముంతాజ్ ఖాన్‌లు, ఫార్వర్డ్‌లుగా అజ్మీనా కుజుర్, రుతాజా దాదాసో పిసల్ మరియు దీపికా సోరెంగ్‌లు ఎంపికయ్యారు.

ఇక‌, ప్రపంచకప్‌లో మొత్తం 16 జట్లు పాల్గొననుండగా.. భారత మహిళల జట్టు నమీబియా, పోలాండ్, యునైటెడ్ స్టేట్స్‌తో పాటు పూల్ సిలో ఉంది. పూల్ Aలో ఫిజీ, మలేషియా, నెదర్లాండ్స్, ఆతిథ్య జట్టు ఒమన్ జట్లు ఉండగా.. పూల్ బిలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఉక్రెయిన్, జాంబియా ఉన్నాయి. ఇక పూల్ డిలో న్యూజిలాండ్, పరాగ్వే, థాయిలాండ్, ఉరుగ్వే ఉన్నాయి.

భార‌త‌ పరుషుల జట్టు..

- Advertisement -

జట్టులో గోల్ కీపర్లు సూరజ్ కర్కేరా, ప్రశాంత్ కుమార్ చౌహాన్ ఉన్నారు. మన్‌దీప్ మోర్‌తో పాటు మంజీత్ డిఫెన్స్‌లో చేరనున్నాడు. మిడ్‌ఫీల్డ్‌లో మొహమ్మద్ రహీల్ మౌసీన్, మణిందర్ సింగ్ ఉన్నారు, ఫార్వర్డ్‌లైన్‌లో కెప్టెన్ సిమ్రంజీత్‌తో పాటు పవన్ రాజ్‌భర్, గుర్జోత్ సింగ్, ఉత్తమ్ సింగ్ ఉన్నారు.

పూల్ బిలో గ్రూప్‌లో ఉన్న‌ భార‌త జ‌ట్టు నాకౌట్ రౌండ్‌లోకి ప్రవేశించడానికి ఈజిప్ట్, జమైకా, స్విట్జర్లాండ్‌లతో తలపడనుంది. పోరులో ఉన్న ఇతర జట్లలో నెదర్లాండ్స్, నైజీరియా, పాకిస్తాన్, పోలాండ్ పూల్-ఎలో ఉన్నాయి. పూల్ సిలో ఆస్ట్రేలియా, కెన్యా, న్యూజిలాండ్, ట్రినిడాడ్ మరియు టొబాగో ఉన్నాయి. పూల్ D లో ఫిజీ, మలేషియా, ఒమన్, యునైటెడ్ స్టేట్స్ ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement