Thursday, September 21, 2023

Exclusive | ఆరు ఓవర్లలోనే ఫసక్​.. ఆసియా కప్పు​ మనదే బిగిలు!

ఆసియా కప్​లో భారత్​ విజయకేతనం ఎగరేసింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్​ పోరులో 50 ఓవర్ల మ్యాచ్​ని ఆరు ఓవర్లలోనే ఫసక్​ అనిపించారు భారత బ్యాటర్లు. దీంతో అభిమానులు ఆసియా కప్​ మనదే బిగిలు అనుకుంటూ సంబురాలు చేసుకుంటున్నారు. కాగా, ఆదిలోనే శ్రీలంకను బ్యాట్​ లేపకుండా కట్టడిచేసిన బౌలర్లకు తోడు వికెట్​ కూడా పడిపోకుండా టీమిండియా ఘనాతి ఘన విజయం సాధించింది.

- Advertisement -
   

ఈ మ్యాచ్​కు ముందు అందరూ టెన్షన్​కు గురయినా.. భారత బౌలర్ల విజృంభణతో ఆట స్వరూపం పూర్తిగా మారిపోయింది. కేవలం 15 ఓవర్లలోనే లంకను పెవిలియన్​కు పంపిన భారత జట్టు.. ఆ తర్వాత చేజింగ్​లోనూ సత్తాచాటింది. కేవలం 6 ఓవర్లలోనే స్వల్ప టార్గెట్​ని అలవోకగా చేధించి విజయం సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు మొత్తం 16 సీజన్ల ఆసియాకప్​లో ఈ మ్యాచ్​ విజయంతో టీమిండియాకు 8వ ఆసియా కప్​ సొంతం చేసుకోవడం మరో రికార్డు…

ఈ మ్యాచ్​లో బ్యాటింగ్​కు దిగిన ఇషాన్​ కిషన్​, శుభ్​మన్​ గిల్​ దూకుడుగా ఆడారు. ఇషాన్​ 23, గిల్​ 27 పరుగులతో ఆకట్టుకున్నారు. దీంతో 50 పరుగుల టార్గెట్​ని ఈజీగా చేజ్​ చేసి.. వికెట్​ పడిపోకుండా 51 పరుగులు సాధించారు. దీంతో టీమిండియా 10 వికెట్ల విజయాన్ని సొంతం చేసుకుంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement