Thursday, May 2, 2024

CWC 2023 – శివాలెత్తిన ఆసీస్ బ్యాటర్స్ వార్నర్, మ్యాక్సీ వెల్.. నెదర్లాండ్స్ టార్గెట్ 400 రన్స్

హైదరాబాద్: వన్డే ప్రపంచకప్లో ఆడుతున్న పలు జట్లు 350 ను మినిమం టార్గెట్గా ఫిక్స్ చేసుకున్నట్టున్నాయి. చిన్నా, పెద్ద జట్లు అనే తేడాలేకుండా బ్యాటర్లు బ్యాట్ ఝుళిపిస్తున్నారు. ఆస్ట్రేలియా కూడా మరోసారి రెచ్చిపోయి ఆడి నెదర్లాండ్స్ ఎదుట 400 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది. అంతగా అనుభవంలేని నెదర్లాండ్స్ బౌలర్లను ఉతికారేసింది.

ఓపెనర్ డేవిడ్ వార్నర్ (93 బంతుల్లో 104, 11 బౌండరీలు, 3 సిక్సర్లు) బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్తో అలరించాడు. వార్నర్కు తోడుగా మ్యాక్స్వెల్ (44 బంతుల్లో 106, 9 ఫోర్లు, 8 సిక్సర్లు) కూడా ఆఖర్లో శివాలెత్తడంతో ఆసీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోరు చేసింది. స్టీవ్ స్మిత్ (68 బంతుల్లో 71, 9 ఫోర్లు, 1 సిక్సర్), మార్నస్ లబూషేన్ (47 బంతుల్లో 62, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మిడిలార్డర్లో ఆసీస్ స్కోరుబోర్డును నడిపించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement