Saturday, April 13, 2024

IPL | సన్‌రైజర్స్‌ సారథిగా కమిన్స్‌!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 17వ సీజన్‌(ఐపీఎల్‌-2024)కు ఇరవై రోజులే ఉంది. ఫ్రాంచైజీలు జట్టు కూర్పులో తలమునకలై ఉన్నాయి. గతేడాది పేలవ ప్రదర్శనతో అభిమానులను ఉస్సూరుమనిపించిన మాజీ చాంపియన్‌ సన్‌రైజర్స్‌ #హదరాబాద్‌ ఈసారి టైటిల్‌పై కన్నేసింది. ఈ క్రమంలో కెప్టెన్‌ను మార్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఎడెన్‌ మార్‌క్రమ్‌ స్థానంలో ప్యాట్‌ కమిన్స్‌కు పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఆస్ట్రేలియాకు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన కమిన్స్‌వైపు మేనేజ్‌మెంట్‌ మొగ్గుచూపుతోందని తెలిసింది. రెండు మూడు రోజుల్లో కెప్టెన్‌ ఎవరన్నదానిపై స్పష్టతరానుంది. 2022లో టెస్టు సారథిగా ఎంపికైన అతడు గతేడాది ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ గదతో పాటు వన్డే వరల్డ్‌ కప్‌ ట్రోఫీని జట్టుకు అందించాడు. అందుకనే మినీ వేలంలో హైదరాబాద్‌ ఫ్రాంచైజీ ఏకంగా రూ.20.50 కోట్లు వెచ్చించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement