Saturday, April 27, 2024

IPL : అభిమానులకు బిగ్ షాక్.. బీసీసీఐ సంచలన నిర్ణయం!

ఐపీఎల్ 2024 షెడ్యూల్ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశంలో సార్వత్రిక ఎన్నికల జరుగుతుండటంతో ఐపీఎల్ సెకండాఫ్ మ్యాచ్‌లను దుబాయ్ వేదికగా నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే 22 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించిన బీసీసీఐ.. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ అనంతరం మిగతా మ్యాచ్‌ల వివరాలను వెల్లడించాలనుకుంది.

- Advertisement -

ఎన్నికల షెడ్యూల్ నేటి సాయంత్రం వెలువడనుండగా దశలవారీగా ఎన్నికల జరగనుండటంతో సెకండాఫ్ మ్యాచ్‌లను విదేశాల్లో నిర్వహించాలని భావిస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే బీసీసీఐ.. ఐపీఎల్ 2024 టోర్నీ గురించి కీలక ప్రకటన చేయనుంది.

ఎన్నికల షెడ్యూల్ ప్రకారం సెకండాఫ్ మ్యాచ్‌లను కూడా భారత్‌లోనే నిర్ణయించాలని బీసీసీఐ మొదట భావించింది. ఎన్నికలు లేని నగరాల్లో మ్యాచ్‌లు పెట్టాలనుకుంది. కానీ సార్వత్రిక ఎన్నికలు పలు దశల్లో నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం నిర్ణయించడంతో.. బీసీసీఐ తమ ప్రణాళికలను మార్చుకున్నట్లు తెలుస్తోంది.

విదేశాల్లో నిర్వహించడం ఉత్తమనే అభిప్రాయానికి వచ్చినట్లు అర్థమవుతోంది. ఎన్నికల సమయంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు సెక్యూరిటీ ఇవ్వలేమని ఆయా రాష్ట్రాల పోలీస్ శాఖలు తెలియజేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దాంతో ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని భారత అభిమానులు కోల్పోనున్నారు.
బీసీసీఐ ప్రకటించిన ఫస్టాఫ్ ఐపీఎల్ 2024 షెడ్యూల్ ప్రకారం.. మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై వేదికగా తొలి మ్యాచ్ ఆడనున్నాయి. ఫస్టాఫ్ షెడ్యూల్‌లో మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement