Friday, May 3, 2024

Pushpa The Rule : ఆగ‌స్ట్ 15న బిగ్ ఫైట్ …

పెద్ద సినిమాలని రిలీజ్ చేయడానికి దర్శక, నిర్మాతలు లాంగ్ వీకెండ్ ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. అలాగే పర్టిక్యులర్ గా కొన్ని సీజన్స్ ని మాత్రమే టార్గెట్ చేసుకొని వారి సినిమాలు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఆగష్టు 15 డేట్ దర్శక, నిర్మాతలకి ప్రామిసింగ్ డేట్ గా ఉంది. ఈ డేట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ మూవీ థియేటర్స్ లోకి రాబోతోంది.

- Advertisement -

పెద్ద సినిమాలని రిలీజ్ చేయడానికి దర్శక, నిర్మాతలు లాంగ్ వీకెండ్ ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. అలాగే పర్టిక్యులర్ గా కొన్ని సీజన్స్ ని మాత్రమే టార్గెట్ చేసుకొని వారి సినిమాలు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఆగష్టు 15 డేట్ దర్శక, నిర్మాతలకి ప్రామిసింగ్ డేట్ గా ఉంది. ఈ డేట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప

పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోయే ఈ సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. సుకుమార్ టీమ్ కూడా పెర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఆగష్టు 15కి ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితిలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అయితే తప్ప రిలీజ్ డేట్ మరే అవకాశం లేదు.

మరోవైపు కన్నడ ఇండస్ట్రీ నుంచి శివరాజ్ కుమార్ హీరోగా తెరకెక్కుతోన్న భైరాతి రంగల్ మూవీ ఆగష్టు 15న రిలీజ్ కాబోతోంది. మఫ్టీ ప్రీక్వెల్ గా ఈ సినిమా నార్తన్ దర్శకత్వంలో సిద్ధం అవుతోంది. దీంతో ఈ మూవీపైన కూడా కన్నడనాట భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మమ్ముట్టి భీష్మపర్వం ఫేమ్ అమల్ నీరద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా కూడా ఆగష్టు 15న విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

ఇళయదళపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ GOAT కూడా ఆగష్టు 15న విడుదల కానుంది. ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

హిందీలో అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కుతోన్న సింగం రిటర్న్స్ మూవీ కూడా ఆగష్టు 15న రిలీజ్ కాబోతోంది. ఇలా అన్ని భాషలలో ఈ డేట్ కి మూవీస్ రాబోతూ ఉండటంతో సిల్వర్ స్క్రీన్ పై పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement