Monday, June 17, 2024

BCCI Awards | రవిశాస్త్రికి లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు!

హైదరాబాద్‌: హైదరాబాద్‌ వేదికగా రేపు (మంగ‌ళ‌వారం) బీసీసీఐ ప్రతిష్టాత్మక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరుగనుంది. ఇందు కోసం భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. దాదాపు మూడేళ్ల తర్వాత బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహిస్తోంది. టీమిండియాకు ఆల్‌రౌండర్‌గా.. భారత జట్టుకు హెడ్‌ కోచ్‌గా అద్భుత సేవలు అందించిన మాజీ క్రికెటర్‌ రవిశాస్త్రికి బీసీసీఐ అరుదైన గౌరవంతో సత్కరించనుంది.

మంగళవారం జరిగే ఈ కార్యక్రమంలో రవిశాస్త్రి లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు అందుకోనున్నాడు. ఈ విషయాన్ని ఇవ్వాల (సోమవారం) బీసీసీఐ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. అలాగే టీమిండియా యువ ఓపెనర్‌ శుభ్‌మాన్‌ గిల్‌ కూడా క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌-2023గా ఎంపికయ్యాడని తెలిసింది. గత ఏడాది వన్డేల్లో అద్బుతంగా రాణించిన గిల్‌ అత్యంత వేగంగా 2వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అలాగే మిగితా ఫార్మాట్‌లలోనూ గిల్‌ సత్తా చాటుకున్నాడు. మరోవైపు ఇతర యువ ఆటగాళ్లకు కూడా కొన్ని అవార్డులు దక్కనున్నాయని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement