Monday, April 29, 2024

BAN vs SL : బంగ్లాదేశ్ టార్గెట్ 280 పరుగులు

ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య ఐసీసీ వరల్డ్ కప్ లో భాగంగా 38వ వన్డే మ్యాచ్ జరుగుతోంది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక జట్టు 49.3 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

శ్రీలంక బ్యాట్స్ మెన్లు చరిత్ అసలంక 108 పరుగులు, పతుమ్ నిస్సంహ, సదీర సమర విక్రమలు 41 పరుగుల చొప్పున చేయగా, ధనుంజయ డిసిల్వ 34 పరుగులు, మహేష్ థీక్షణ 22 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే నిర్ణీత 50 ఓవర్లలో 280 పరుగులు చేయాల్సి ఉంది.


Advertisement

తాజా వార్తలు

Advertisement