Friday, June 14, 2024

Badminton | సెమీస్‌కు చేరుకున్న భారత మహిళల జట్టు.. !

మలేషియా వేదికగా జరుగుతున్న బ్యాడ్మింటన్‌ ఆసియా టీమ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో హాంకాంగ్‌పై విజయం సాధించి భారత మహిళా షట్లర్లు తొలి బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్ పతకాన్ని ఖాయం చేసుకున్నారు. భార‌త్ త‌మ సెమీస్ లో జపాన్ తో తలపడనుంది.

గాయం నుండి తిరిగి వచ్చిన సింధు 21-7, 16-21, 21-12 స్కోరుతో సిన్ యాన్ హ్యాపీపై గెలిచింది. మహిళల డబుల్స్‌లో తనీషా-పొన్నప్పల జోడీ 21-10, 21-14తో యెంగ్ న్గా టింగ్-యెంగ్ పుయ్ లామ్‌ల పై విజ‌యం సాధించింది.

ఆ తర్వాత అశ్మిత 21-12, 21-13తో యెంగ్ సమ్ యీపై సునాయాసంగా విజయం సాధించింది. దీంతో భార‌త జట్టుకు ఆసియా టీమ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో ప‌త‌కం ఖాయం అనే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement